మరో జన్మంటూ ఉంటే… ఏనుగులా పుట్టాలనుంది: అనసూయ

న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకుంది అందాల అనసూయ.ఇక సినిమాల్లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా బాగా రాణించింది. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

తన మనసులో ఉన్న భావాలను ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెడుతుంటుంది అను. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని ఉందన్న ప్రశ్నకు జవాబుగా ఏనుగులా అని సమాధానం ఇచ్చింది. ఇంతకీ అనసూయ ఇలా సమాధానం ఇవ్వడానికిగల కారణాన్ని చెబుతూ…’ఏనుగు జాతిలో వారి వారి భాగస్వాములు చనిపోతే.. మిగిలిన ఆ ఏనుగు తిండి తిప్పలు మానేసి చనిపోతుంది. అలాగే వృద్దురాలైనా ఆడ ఏనుగే కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది.

అందుకే ఏనుగులా పుట్టాలని కోరుకుంటున్నాను’ అని అనసూయ తెలిపింది.ఇక సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగులు ఎక్కువగా జరుగుతాయనే విషయం తెలిసిందే…

ఇదే విషయాన్ని తన దగ్గర ప్రస్తావించగా… మొదట్లో ఆ ట్రోలింగ్స్ చూసి భయపడిపోయేదాన్నని కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని చెప్పింది. ఇదిలా ఉంటే పలు సందర్భాల్లో తనపై ట్రోలింగ్ చేసిన వారిని అనసూయ చెడాపెడ ఆరేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here