ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘రాధే శ్యామ్’ టీజర్..?

‘బాహుబలి’ అనే ఒక్క సినిమాతో అందనంత ఎత్తుకు ఎదిగాడు నటుడు ప్రభాస్. ఈ సినిమాతో భారత్ లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులను సంపాదించున్నాడీ యంగ్ రెబల్ స్టార్ట్. ఇప్పుడు ప్రభాస్ హీరోగా సినిమా వస్తుందంటే చాలు అదో పెద్ద వార్త. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాల బడ్జెట్ లు కూడా ఆయన స్టామినా ఏంటో చెప్పకనే

చెబుతున్నాయి.  ‘సాహో’ విడుదలై ఏడాది గడుస్తోన్నా ప్రభాస్ తదుపరి చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక చిన్న టీజర్ కూడా రాలేదు…  అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు త్వరలోనే నిజం కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబర్ 23న ‘రాధే శ్యామ్’ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ‘రాధే’ శ్యామ్ టీం తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. చిత్ర  షూటింగ్ తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ అతి త్వరలో ఇటలీ బయల్దేరబోతోందని అందుకోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ‘రాధే శ్యామ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కే కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here