టీఎస్‌ ఐ-పాస్‌ విధానాన్నిమెచ్చుకున్న కేంద్ర మంత్రి..!

తెలంగాణ సర్కార్ టీఎస్‌ఐపాస్ ను అమలులోకి తెచ్చింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే టీఎస్‌ఐపాస్ విధానాన్ని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మెచ్చుకున్నారు. రాష్ట్రాల పరిశ్రమల శాఖల మంత్రులతో వర్చవల్ మీటింగ్ నిర్వహించారు. టీఎస్‌ ఐ-పాస్‌ గురించి కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌, డీమ్డ్‌ అప్రూవల్స్‌ వంటి విధానాలతో సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని కేటీఆర్‌ కేంద్రమంత్రికి చెప్పారు.

తాజాగా సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌ ఆఫ్‌ క్యాపిటల్‌గా తయారు చేసే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. చైనా నుంచి తరలిపోయి ఇతర దేశాల్లో ప్లాంట్లు పెట్టాలనుకుంటున్న సంస్థను తెలంగాణకు రప్పించేందుకు కేటీఆర్ ఇప్పటికే భూములను కూడా కేటాయించారు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని పట్టుదలగా కృషి చేస్తున్నారు కేటీర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here