ట్రంపైనా ఒప్పుకోవాల్సిందేగా.. అంతేగా..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న స‌మ‌యంలో అంద‌రూ వ‌ణికి పోయిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. లాక్ డౌన్ అంటూ ప్ర‌పంచ‌మే ఆగిపోయినా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం అదేమీ లేద‌ని కొట్టి పారేశారు. ఇప్పుడ దారిలోకొచ్చారు ట్రంప్..

క‌రోనా విజృంభ‌ణ‌ను ఆపాలంటే ముందుగా మాస్కు వేసుకొని, భౌతిక దూరం పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చిన్న‌పిల్లోడిని అడిగినా చెప్తారు. అలాంటిది డొనాల్డ్ మాత్రం మాస్కు అవ‌స‌ర‌మే లేద‌ని చెప్పారు. ఎంత‌మంది ఆయ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించినా ఆయ‌న విన‌లేదు. ఆయ‌నే కొన్ని రోజుల‌కు మాస్క్ పెట్టుకొని ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

అయితే క‌రోనాను త‌క్కువ అంచ‌నా వేస్తూ వ‌చ్చిన ట్రంప్ చివ‌ర‌కు అంద‌రిలాగే క‌రోనాను పోల్చారు. ఇది అంత ఈజీ వైర‌స్ కాద‌ని.. చాలా భ‌యంక‌ర‌మైనేద‌న‌ని వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఇంట‌ర్వూలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే తాను అమెరికాలాంటి అగ్ర‌దేశానికి అధ్య‌క్షుడిన‌ని తాను భ‌య‌ప‌డి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌కూడ‌ద‌న్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ట్రంప్ క‌రోనా ప‌ట్ల వాస్త‌వ‌మైన ప్ర‌క‌ట‌న చేసేట‌ప్ప‌టికీ అంద‌రూ ట్రంప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రంప్‌నే మార్చేసింది క‌రోనా అంటున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here