ప్ర‌జ‌ల‌కు కీల‌క సందేశ‌మిచ్చిన ట్రంప్‌..

అమెరికా అధ్య‌క్షుడ డొనాల్డ్ ట్రంప్ కీల‌క సందేశ‌మిచ్చారు. త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. నిన్న‌టి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఓ వీడియో పంపారు.

త్వ‌రలోనే తాను కోలుకుంటాన‌ని ట్రంప్ చెప్పారు. మొద‌ట్లో కొంత ఇబ్బంది ప‌డ్డాన‌ని చెప్పిన ఆయ‌న ప్ర‌స్తుతం బాగున్న‌ట్లు చెప్పారు. కోలుకుంటాన‌ని చెబుతున్న ట్రంప్ కూడా రానున్న రెండు మూడు రోజులు కీల‌కం అని చెప్పారు. కాగా రెండు రోజుల నుంచి ఆయ‌న ఆరోగ్యంపై ఇదే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. రెండు రోజులు గ‌డిస్తే కానీ చెప్ప‌లేం అన్న‌ట్లు తెలిసింది. ఇప్పుడు ట్రంప్ కూడా రెండు మూడు రోజులు కీల‌కం అంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ నెల‌కొంది.

ట్రంప్ ఎన్నిక‌ల గురించి మాట్లాడారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంట‌నే ప్ర‌చారం మొద‌లు పెడ‌తాన‌ని చెప్పారు. ట్రంప్ హాస్పిట‌ల్ నుంచే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాటు చేశారు. క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఆపివేయాల్సి వ‌చ్చింద‌న్నారు ట్రంప్‌. అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డు చేశారో తెలియ‌డం లేదు. ఏదిఏమైనా ట్రంప్ ప‌రిస్థితి మాత్రం కాస్త ఆందోళ‌న క‌రంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here