విజృంభిస్తున్న క‌రోనా.. రోజూ ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా.

ఇండియాలో క‌రోనా వైర‌స్ విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. వారంలో ఓ రోజు కేసులు త‌గ్గితే మ‌రో రోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఇంకా భ‌యాందోళ‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 75,829 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. కాగా వీరిలో మొత్తం 55,09,967 మంది క‌రోనాను జ‌యించారు. 9,37,625 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 1,01,782 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. కాగా ప్ర‌పంచంలో వేగంగా రిక‌వ‌రీ అవుతున్న దేశాల్లో భార‌త్ ఉంది. ప్ర‌తి రోజూ వెయ్యి మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు.

క‌రోనా టెస్టులు కూడా ఎక్కువ‌గానే చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 14,42,131 ప‌రీక్ష‌లు చేశారు. క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అంతా అనుకుంటున్నా ఇది మాత్రం జ‌ర‌గ‌డం లేదు. అయితే ఆగ‌ష్టు 1వ తేదీన 33.32 శాతం యాక్టీవ్ కేసులు ఉంటే.. సెప్టెంబ‌ర్ 30 నాటికి 15.11 శాతంకి త‌గ్గిన‌ట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. మొన్న‌టి వ‌ర‌కు రోజూ 10వేల కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా ఇప్పుడు 6 వేలు, 7 వేల‌కు చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here