శంషాబాద్ విమానాశ్ర‌యంలో అల‌ర్ట్‌.. విలువైన వ‌జ్రాభ‌ర‌ణాలు స్వాధీనం.

బంగారం, వ‌జ్రాల స్మ‌గ్లింగ్‌ను అధికారులు క‌ట్ట‌డి చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో అధికారుల‌కు అందిన స‌మాచారం మేర‌కు క‌స్ట‌మ్స్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఓ కోరియ‌ర్‌లో భారీగా వ‌జ్రాలు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబైకి త‌ర‌లించేందుకు శంషాబాద్ విమానాశ్ర‌యాన్ని కేంద్రంగా ఎంచుకున్న స్మ‌గ్ల‌ర్ల డ్రామా బ‌య‌ట‌ప‌డింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ కార్గోలో ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున త‌నిఖీలు చేశారు. ఉద‌యం నుంచి ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. పెద్ద ఎత్తున స్మ‌గ్లింగ్ జ‌రుగుతోంద‌న్న స‌మాచారంతో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం త‌నిఖీలు చేస్తోంది. ఈ త‌నిఖీల్లో ముంబై వెళుతున్న పార్సెల్‌లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు.

బంగారాన్ని గుర్తు ప‌ట్ట‌కుండా వెండి పూత పూసినట్లు గుర్తించారు. గోల్డ్ మాఫియాకు సంబంధించి ముందే స‌మాచారం అందిన‌ట్లు తెలుస్తోంది. కాగా వీటి విలువ రూ. 30 కోట్లు ఉంటుంద‌న అధికారులు అంచ‌నా వేశారు. పార్శిల్‌పై ఉన్న వివ‌రాల ఆధారంగా వీటిని ఎవరు పంపార‌న్న దానిపై విచార‌ణ చేస్తున్నారు. ప‌క్క‌గా ముంబైకి వీటిని పంపుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. హైద‌రాబాద్ కేంద్రంగా మాఫియా చెల‌రేగిపోతోంద‌న్న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here