ఎవ్వ‌రూ ఊహించ‌నంత త్వ‌ర‌గా కోలుకున్న ట్రంప్‌..

క‌రోనా పేరు చెబితేనే ఇప్పుడు ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అలాంటిది క‌రోనా సోకిన ట్రంప్ మాత్రం చాలా త్వ‌ర‌గా కోలుకున్నారు. వ‌య‌స్సు మీద‌పడుతున్న వారికి క‌రోనా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్న త‌రుణంలో ట్రంప్ కోలుకున్న తీరు ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి కోలుకున్న దాంట్ల ప్ర‌ధానంగా ఆయ‌న ఆత్మ‌విశ్వాసాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న ముందు నుంచీ క‌రోనాను చాలా తేలిగ్గా తీసుకుని ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అందుకే ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ప్పుడు కూడా లైట్ తీసుకున్న‌ట్లు ఉన్నార‌ని అంతా అనుకుంటున్నారు. అందుకే దీనికి భ‌య‌ప‌డ‌కుండా రెసిస్టెన్స్ ప‌వ‌ర్ పెంచుకొని త్వ‌ర‌గా కోలుకున్నార‌ని చెప్పుకుంటున్నారు. ఇక ప్ర‌ధానంగా ఇంత‌వ‌ర‌కూ ఎవ్వ‌రికీ ఇవ్వ‌ని మెడిసిన్లు కూడా ట్రంప్‌కు ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఈ ఔష‌దాల వ‌ల్ల‌నే ఆయ‌న ఇంత త్వ‌ర‌గా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 74 ఏళ్ల ట్రంప్‌కు ప్ర‌త్యేక ట్రీట్ మెంట్ ఇచ్చారు. మిలటరీ ఆస్పత్రిలో చేరిన‌ ట్రంప్ కు మూడు రోజులు యాంటీ వైరల్ డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఇవ్వ‌డంతో చాలా మేలు జ‌రిగింద‌ని అంటున్నారు. యాంటీ బాడీ థెరపీని ఆర్ఈజీఎన్-సీవోవీ2 థెరపీని వాడడానికి ఇంకా అనుమతులు లేవు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ట్రంప్ కోసం ప్ర‌త్యే్క అనుమ‌తులు తీసుకొని వైద్యం చేశారు. దీంతో ఈయ‌న కోలుకున్నారు. ప్ర‌స్తుతం ట్రంప్‌లో క‌రోనాకు సంబంధించిన‌ది ఏదీ లేద‌ని వైద్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here