ట్రంప్ ఇంత పెద్ద మొత్తంలో భార‌త్‌లో ఎందుకు ప‌న్నులు క‌డుతున్నారో తెలుసా..

స‌మాజంలో వివాదాలు చాలా వ‌ర‌కు కొద్ది మంది చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారిలో ఒక‌రు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వివాదాల్లో కావాల‌నే ఇరుక్కుంటారో లేదా అవంత‌ట అవే వ‌చ్చి వీళ్ల‌ని అంటిపెట్టుకుటాంటాయో కానీ ట్రంప్ ఈ మ‌ధ్య వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అమెరికా అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో రెండో సారి ఉన్న ట్రంప్‌కు ఈసారి ట్యాక్సుల వివాదం అంటుకుంది.

ట్రంప్ కు సంబంధించిన ట్యాక్స్ గురించి ఇప్పుడు వివాదం మొద‌లైంది. అక్క‌డి ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌న్నుల‌ను ట్రంప్ చెల్లించ‌లేద‌ని ఇటీవ‌ల న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీంతో అంతా షాక్‌కు గుర‌య్యారు. ట్రంప్ ట్యాక్స్ చెల్లించ‌కుండా ఎలా ఉంటారంటూ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి. ఆ క‌థ‌నంలో ఏముందంటే 2016, 2017లో 750 డాల‌ర్ల చొప్పున మాత్రమే ప‌న్నులు చెల్లించార‌ని పేర్కొంది.

ప‌దిహేను సంవ‌త్స‌రాల్లో ప‌ది సంవ‌త్సరాలు ట్రంప్ ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వానికి ప‌న్నులు చెల్లించ‌లేదట‌. అయితే ఓ సంద‌ర్బంలో విదేశాల్లోనూ ప‌న్నులు చెల్లిస్తున్న‌ట్లు చెప్పిన ట్రంప్.. భార‌త్‌లో 1,45,400 డాల‌ర్ల ప‌న్నులు ఆయ‌న ఆయ‌న కంపెనీల‌కు సంబంధించి చెల్లిస్తున్న‌ట్లు చెప్పారు. అమెరికా కంటే భారత్‌లోనే ట్రంప్ ప‌న్నులు ఎక్కువ క‌ట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను ట్రంప్ కొట్టిపారేశారు. ప‌న్నులు ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఆదాయ‌పు వివ‌రాలు తెలపాల‌ని ఎవ‌రైనా కోరితే వారిపై ట్రంప్ వెంట‌నే న్యాయ‌పోరాటానికి సిద్ద‌మ‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here