బండ్ల గణేష్ కు మళ్లీ అవకాశం ఇచ్చిన పవన్.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న అశేష అభిమానుల్లో  బండ్ల గణేష్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి బడా నిర్మాతల్లో ఒకరిగా మారిన బండ్ల గణేష్ కు పవన్ అంటే ప్రత్యేక అభిమానం. పలుసార్లు సభవేదికగా కూడా గణేష్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ మరోసారి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదివరకు తీన్మార్, గబ్బర్ సింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్లగణేష్… గబ్బర్ సింగ్ తో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా తర్వాతి ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు” అని క్యాప్షన్ జోడించాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here