అందమైన భామలు చిన్నారుల్లా మారిపోతే..!

టెక్నాలజీ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సాంకేతికత పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న యాప్ తో ఎన్నో అద్భుతాలను చేసేస్తున్నారు. ఫోటోషాప్ లో చేసే ఎడిటింగ్ లను  కూడా మొబైల్ యాప్ లో ఎంతో సింపుల్ గా చేసేస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం… తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫోటో మారిన టెక్నాలజీకి అద్దం పడుతోంది.

ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే… పెద్దవారు చిన్న పిల్లల్లా  కనిపిస్తే ఎలా ఉంటారన్న దాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించినది. టాలీవుడ్ లో తమ నటన, అందచందాలతో ఆకట్టుకుంటోన్న హీరోయిన్లు చిన్న బుజ్జి పాపలుగా మారినట్లుగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలో చిన్న పిల్లల్లా మారిన కీర్తి సురేశ్‌, రష్మిక, అనుపమ పరమేశ్వరన్‌, సమంత, అనుష్క, కాజల్‌, రాశీఖన్నా, తమన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆశ్చర్య పోవడంతో పాటు.. హీరోయిన్లు ఎంత క్యూట్ గా ఉన్నారే అంటూ కామెంట్లు పెడుతున్నారు.https://twitter.com/PulagamOfficial/status/1310141944685711360

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here