పవన్ కళ్యాణ్ కి క్లాస్ పీకిన త్రివిక్రమ్ …

వరసగా మూడు సినిమాలనీ ప్రొడ్యూసర్ శరత్ మరార్ తో తీసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు అన్నీ తనకి అనుకూలమైన తనకి ఇస్తమయిన టైం లలో ప్లాన్ చేసుకున్నాడు, మూడ్ లేనప్పుడు షూటింగ్ ఆపెయ్యడం – చిరాకుగా ఉంటె ఒక జనసేన మీటింగ్ పెట్టుకోవడం ఇలా జరిగింది . గోపాల గోపాలా టైం నుంచీ ఇదే వ్యవహారం నడుస్తోంది కూడా. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో దాదాపు నెలరోజులు ఇలాగే టైం వేస్ట్ చేసాడు పవన్ కళ్యాణ్. కాటమరాయుడు సెకండ్ హాఫ్ మొత్తం మూడు వారాల్లో చుట్టేశారు అనే న్యూస్ కూడా మనం వింటున్నాం.

అయితే ఈ హడావిడి వ్యవహారం సినిమాల క్వాలిటీ లని గట్టిగా దెబ్బ తీస్తోంది. సొంత బ్యానర్ , ఫ్రెండ్ బ్యానర్ అవ్వడం తో కళ్యాణ్ కి ఇదంతా కుదిరింది. త్రివిక్రమ్ సినిమాకోసం ఎనభై రోజులు డేట్ లు ఇచ్చిన కళ్యాణ్ మధ్యలో ఉండే షెడ్యూల్ బ్రేక్స్ తప్ప ఇంకేమీ తీసుకోవద్దు అని త్రివిక్రమ్ గట్టి క్లాస్ పీకాడట. తన సినిమా లో క్వాలిటీ ఇంపార్టెంట్ అనీ పొరపాటున కూడా దాన్ని ఇబ్బంది పెట్టద్దు అని రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో కలిసిన కళ్యాణ్ తో ఓపెన్ గా చెప్పేసాడు త్రివిక్రమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here