‘నువ్వేకావాలి’ గురించి త్రివిక్రమ్‌ ఏమన్నారంటే..!

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈరోజు (13 అక్టోబర్‌ 2000) ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలైంది. సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమాలో తరుణ్‌, రిచా జంటగా నటించారు. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఇక ఈ సినిమాకు విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు అందించాడు. ఇదిలా ఉంటే నువ్వే కావాలి చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఈ విషయమై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నువ్వేకావాలి సినిమా అనగానే నాకు ముందు ఓ విషయం గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నీరం సినిమా షో వేశం. అయితే అది పూర్తయిన తర్వాత నేను, రవి కిషోర్ గారు ,రామోజీరావు గారు బయటికి వచ్చి 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నాం. ఆ 20 నిమిషాల మాటలు ఇప్పుడు ఇరవై ఏళ్లు గడుస్తున్నా నువ్వేకావాలి. ‘ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఎలా చూపించబోతున్నారు’ అని రామోజీ రావు గారు అడిగారు. దీనికి ముందే నేను రవికిషోర్ విజయ భాస్కర్ సినిమాలో చేసిన మార్పుల గురించి మద్రాసులో మాట్లాడుకున్నాం. అవన్నీ నేను వివరించా. ‘మీకు పూర్తి నమ్మకం ఉందా’ అని ప్రశ్నించారు.. ఉంది అన్నాం. అయితే సరే చిత్రం తీయండి అన్నారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. 50 రోజుల్లోపే పూర్తి చేసిన ఈ సినిమా 365 రోజులకు పైగా ఆడింది. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తున్న సినిమా ఇది’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు త్రివిక్రమ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here