మరో అడుగు ముందుకేసిన సోనూసూద్‌..!

లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసిన నటుడు సోనూసూద్‌ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు మద్ధతు ఒక రేంజ్‌లో పెరిగిపోయింది. ఇలా మొదలు పెట్టిన ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఫలానా సమస్య ఉందని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేస్తే చాలు క్షణాల్లో తీర్చేస్తున్నాడు. ప్రజలకు సోనూసూద్‌ చేస్తున్న సేవలకి గాను ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించింది.

రీల్‌ లైఫ్‌లో విలన్‌గా కనిపించే సూనూసూద్‌ ఇలా రియల్‌ లైఫ్‌లో హీరోగా మారడంతో ఆయనను దేవుడిగా కీర్తిస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్‌ మరో అడుగు ముందుకేసి ఏకంగా స్కాలర్‌ షిప్‌లు అందించే పనిలో పడ్డాడు. తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ 13 వ వర్ధంతి సందర్భంగా ఆమె పేరు మీదుగా స్కాలర్ షిప్‌లు అందించనున్నట్లు సోనూ ప్రకటించాడు. పేదరికంలో ఉండి ఐఎఎస్ కావాలనే ఆశయంతో ఉన్న వారికి ఈ సహాయం అందించనున్నట్లు సోనూసూద్‌ తెలిపాడు. ఈ స్కాలర్ షిప్ కోసం www.schollifeme.com సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here