మురళీధరన్‌ బయోపిక్‌ మోషన్‌ పోస్టర్‌ చూశారా..!

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌. తనదైన స్పిన్‌ బౌలింగ్‌తో ఎన్నో వికెట్లు పడగొట్టి శ్రీలంక జట్టుకు పలు విజయాలందించిన ముత్తయ్య జీవిత కథ ఆదారంగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. టెస్టులో మురళీధరన్‌ 800 వికెట్లు తీసిన ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్‌ ఖరారు చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ముర‌ళీధ‌ర‌న్ జీవితంలోని ప‌లు ద‌శ‌ల‌ను బొమ్మ‌ల రూపంలో చూపిస్తూ సాగే మోష‌న్ పోస్ట‌ర్ సినీ, క్రీడాభిమానుల‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంఎస్ శ్రీప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్కుతుంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన మురళీధరన్‌ అనంతరం పలు టీ20 టోర్నీల్లో ఆడాడు. అనంతరం కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఆయన సన్‌రైజర్స్‌ జట్టుకు స్పిన్‌ కోచ్‌గా వ్వవహరిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here