అజ్ఞాతవాసి ని సాగదీసిన త్రివిక్రమ్ ..

ప్రస్తుతం ఇండస్ట్రీలో అజ్ఞాతవాసి మ్యానియా నడుస్తోంది. విడుదలకు ముందే అజ్ఞాతవాసి చేసిన వ్యాపారం ఊహాతీతం భీభత్సమైన రేంజిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ కూడా  ఆ విధంగానే ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అజ్ఞాతవాసి సినిమా ముందు ఏ సినిమా పోటీకి రాకపోవడం మరో విశేషం. అజ్ఞాతవాసి సినిమాను యూఎస్ లో బాహుబలి2ని మించి విడుదల చేస్తున్నారంటేనే అంచనాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమౌతుంది.

ఈ క్రమంలో త్రివిక్రమ్ చిత్రీకరించే సినిమా నిడివి కాసింత లెంగ్తీగానే ఉంటాయి.అయితే తాజాగా చిత్ర యూనిట్ అనుకున్న దాని కంటే ఎక్కువ వచ్చిందంట. దీనికి కారణం సినిమా క్లైమాక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ యాడ్ చేసిన వాల్యూ ఎడిషన్స్ అని టాక్. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్ కు పెద్ద పిట్ట వేసారు అని చిత్ర యూనిట్ చెబుతుంది సెకండ్ ఆఫ్ లో వచ్చే ఈ ఎమోషన్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు సినిమాకి సంబంధించిన వారు.

సినిమా  అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది ఇటువంటి సమయంలో ఇంత లెంగ్తీ ఉన్న సినిమా వల్ల ఎక్కువ షోలు వేసుకునేందుకు అడ్డం అవుతుంది.అని కొంతమంది అన్నట్లు సమాచారం… ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ సినిమా రన్ టైం  ఏమాత్రం తగ్గించడం లేదని స్పష్టం చేశారు.ఈ 2గంటల 45 నిమిషాల నిడివితోనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఇటువంటి  విషయాలు అన్నీ రిలీజ్ ముందుకు మాట్లాడుకోవాలని ఈ సందర్భంలో కాదు అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here