దిల్ రాజు కి పవన్ మాట ఇవ్వడం నిజమేనా ?

టాలీవుడ్ లో సక్సెఫుల్ నిర్మాత  అయినా  దిల్ రాజు  తన పుట్టిన రోజునాడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం నా చేతిలో నాని హీరోగా ఎంసిఏ  సినిమా తెరకెక్కిస్తున్నారని  త్వరలోనే ఈ సినిమా  ప్రేక్షకులకు ముందు రాబోతుందని తెలియజేశారు.ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొన్ని సంచలనకరమైన వ్యాఖ్యలు చేసి  అందర్నీ ఆశ్చర్యపరిచారు…. ఇంతకి అయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే  గతంలో  పవన్ కళ్యాణ్ నా కొక సినిమా చేసి  పెడతానని మాట ఇచ్చాడు అని బయట పెట్టారు దిల్ రాజు .

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను నిర్మాత దిల్ రాజుకు గుర్తు చేశారని చెపుకొచ్చారు రాజకియలో బిజీ  గా ఉన్న నీతో సినిమా చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు ..  అని పవన్ తనతో అన్నట్లు పేర్కొన్నారు.ఇదిలావుంటే గతంలో పవన్ కళ్యాణ్ దాసరి గారితో,  ఏ ఏం రత్నంతో సినిమాను చేస్తారని మాట ఇచ్చారు…. మాట అన్నంత మాత్రాన సినిమా అవుద్దా అని విమర్శించేవారు ఉన్నారు. మరి దిల్ రాజు నమ్మకం నిజం అవుతుందా..పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here