త్రివిక్రమ్ సంగతి తేల్చేసిన పవన్ కళ్యాణ్

అజ్ఞాతవాసి ఆడియో వేడుక హైదరాబాద్ లో  ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఈ ఆడియో వేడుకకు హైలైట్ గా నిలిచింది.ఈ క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ తనకు మధ్య ఉన్న  సన్నిహితం గురించి చెప్పుకొచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ ఏది చెప్తే పవన్ కల్యాన్ అది చేస్తారని చాలామంది చెప్పుకుంటున్నారు కానీ నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా కెరీర్ బాగోనప్పుడు నా అనుకున్నవాళ్లంతా ఒంటరి వాడ్నిచేసినప్పుడు పూర్తిగా నిరుత్సాహంలో,  డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక అప్తుడి ల ఆదుకున్నాడు.

నిరుత్సాహంతో, క్రుంగుదలతో నిండి పోయిన నన్ను ఆ ప్రపంచం నుండి బయటకు రావడానికిఎన్నో కవితలుచెప్పేవారు.అటువంటి సందర్భంలో ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పిఅని అన్నారు.నేను ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని ఇచ్చాడు. నేను స్వతహాగా రక్తం పంచుకున్న వారితో లేని చనువు త్రివిక్రమ్ తో ఉందని ఆయన మీద కోప్పడగాలనని  అంత చనువు మా ఇదరి మధ్య ఉందని స్పష్టం చేశాడు పవన్. .ఎం.ఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్చదివిన వ్యక్తి,గోల్డ్ మెడలిస్ట్, గొప్ప రచయిత,అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను లేకపోతే ఆయన లేరా.

ఎంత టాలెంట్ కలిగిన దర్శకుడికి నేను కాకపోతే 100 మంది హీరోలు దొరుకుతారు.ఎందుకు మా ఇద్దరిమధ్య    ఇంత గౌరవంతో కూడిన స్నేహం ఉంది అంటే మేమిద్దరం దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబం లో నుండి వచ్చాం మా ఇద్దరిమధ్య ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది పెద్ద వాళ్లంటే గౌరవిస్తాం, సినిమా పరిశ్రమ అంటే మోకరిల్లా అంత గౌరవం .ఈ ఆలోచనా విధానమే మమ్మలను దగ్గర చేసింది అంటూ తన స్నేహితుడైన  త్రివిక్రమ్ గురించి పవన్ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here