ప్రభాస్ ను చూసి టాప్ హీరోలు వాతలు పెట్టుకుంటున్నారు

టాలీవుడ్ లో చిరునుంచి తారక్ వరకు అంతా సెంచరీలు బాదారు ఓకే…కాని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పెట్టుబడిని కూడా వందకోట్లు దాటించేస్తున్నారు….వసూళ్లతో సెంచరీ కొట్టినా కొట్టకున్నా, బడ్జెట్ మాత్రం వందకోట్లు దాటాల్సిందే….ప్రభాస్ అంటే సీన్ మారింది కాబట్టి, సిచ్చువేషన్ కి తగ్గట్టు 150 కోట్లకి సాహో అన్నాడు…కాని మిగతా వాల్లు ఏమాత్రం పొరుగింట్లో పాతుకుపోయారని, వందకోట్ల మాటెత్తుతున్నారు.
మెగాస్టార్ చిరు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి మూవీకయ్యేది 150 కోట్ల బాలయ్య పైసా ఎంత వసూళ్ల చేస్తాడో కాని, దీనికైన పెట్టుబడి వందకోట్లు…..ఏంటిది వందకోట్లు రాబట్టడమే గొప్పనుకుంటున్న టైంలో, వందకోట్ల పెట్టుబడా? పొరుగింట్లో పాతుకుపోతేనే పెట్టిన వందకు, పైన 50 వస్తుందో రాదో తేలట్లేదు…అలాంటిది, మరో మార్కెట్ లేకున్నా వందకోట్ల సినిమాలేంటని అంటున్నారు….ఇదేం ట్రెండ్ బాబోయ్ అని కామెంట్స్ పెంచారు. 
 బాహుబలి క్రియోట్ చేసిన హిస్టరితో టాలీవుడ్‌లో బడ్జెట్ పెంచే పనిలో బిజి అయ్యారు స్టార్ హీరోస్. ఈ రూట్‌లో మెగాస్టార్  ఉయ్యాల వాడకి  ఏకంగా 150 కోట్లు పెట్టుబడి పెడుతుంటే అదే దారిలో స్సీడ్ పెంచాడు నటసింహం బాలయ్య.
జనరల్‌గా చూస్తే మొన్న చిరు  ఖైదినెం150కి  50 కోట్లు పెట్టుబడి పెడితే వందకోట్లు రాబడిగా మారింది. ఇదే లాజిక్ ఉయ్యాల వాడకి అప్లయ్ చేసి 150కొట్ల బడ్జెట్‌తో 3 లాంగ్వేజస్‌లో ఈ సినిమాని ఓ రేంజ్‌లో తెరకెక్కిచెందుకు రెడి అవుతుంది ఆ ఫీల్మ్ టీం.
టాలీవుడ్‌లో చిరు స్టామినాకి వసూళ్ల వరద వచ్చే ఛాన్స్ ఉంది. కాని పొరుగింటో తన స్టామినా ఎంత అనేదే డౌట్‌గా మారింది. ఇక్కడ సెంచరి వసూళ్లు వచ్చినా  తమిళ్,హింది మార్కెట్లో మరో సెంచరి కొడితేనే ఈ మూవీ గట్టేక్కే పరిస్దితి ..ఏమాత్రం రివర్స్ అయిన  అసలుకే ఎసరోస్తుంది.సీన్ సితరైయ్యే పరిస్దితి కనిపిస్తుంది.
చిరు లెక్క ఇలా ఉంటే  శాతకర్ణితో  సెంచరి వసుళ్లకి దగ్గరగా వచ్చిన బాలయ్య   పైసా వసుళ్లతో ఆ లోటు తిర్చుకునేందుకు రెడి అవుతున్నాడు.ఈ సినిమాకి   100కోట్లు పెట్టుబడి పెట్టి డబుల్ సెంచరి రాబడిగా మార్చేందుకు  ప్లాన్ రెడి చేస్తున్నాడు.
నిజానికి శాతకర్ణి బాగున్నా …సంక్రాంతి బరిలో సందడి చేసిన ఈ మూవికి  50 కోట్లు పెట్టుబడి పెడితే రాబడి 70కోట్లు కూడా దాటలేదని తెలుస్తోంది. అలాటింది పూరి డైరెక్షన్‌లో వస్తున్న పైసా వసూళ్లకి 100కోట్లు పెట్టుబడి పెడితే బాలయ్య ఎంత కొల్లగొడతాడు అనేదే డౌట్‌గా మారింది. ఇక పక్కింట్లో మార్కెట్‌ అయిన తనని గట్టేక్కిస్తుందా అంటే అది డౌటే.
ఎలా చూసిన మెగాస్టార్ ఉయ్యాల వాడకి 150 కోట్లు ,బాలయ్య పైసా వసూళ్లకి 100 కోట్లు..జనరల్‌గా చూస్తే వందకోట్లు రాబట్టడమే గోప్పనుకుంటున్న టైంలోవందకోట్ల పెట్టుబడులు అంటే  పొరుగింట్లో పాతుకుపోతేనే పెట్టిన వందకు  పైన 50 వస్తుందో రాదో తేలట్లేదు..అలాంటిది మరో మార్కెట్  లేకున్నా వందకోట్ల బడ్జెట్ అంటే ఇది ఏ రూట్‌కి గేట్ తీస్తుందో అనే డౌట్స్ క్రియోట్ అవుతున్నాయ్.బాహుబలితో పోలికపెట్టుకుంటే వాతలు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here