కొత్త టీవీ షో తో వస్తున్న టాప్ హీరో

2008లో వ‌చ్చిన ‘ద‌స్ కా ద‌మ్’ కార్య‌క్ర‌మం గుర్తుంది క‌దా! అదే కార్య‌క్ర‌మం ఇప్పుడు స‌రికొత్తగా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈసారి కూడా ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ‘బిగ్‌బాస్’ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.
‘ద‌స్ కా ద‌మ్’ కార్య‌క్ర‌మం వ్యాఖ్యాత ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌ను సోనీ టీవీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ద‌నీష్ ఖాన్‌ని అడ‌గ్గా… ఆ కార్య‌క్ర‌మానికి యాంకరింగ్ చేయ‌గ‌ల స‌త్తా ఇంకెవ‌రికి ఉందంటూ ప‌రోక్షంగా స‌ల్మాన్ వ్యాఖ్యాత అని స‌మాధాన‌మిచ్చాడు. టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌ప్పుడే ప్రేక్ష‌కులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా మొబైల్ ఇంట‌రాక్టివ్ టెక్నాల‌జీని ఈసారి అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ద‌నీష్ ఖాన్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here