బన్నీ వాసు, గుణ శేఖర్ వెనక ఉండి మాట్లాడిస్తోంది అల్లూ అర్జున్ ఏ నా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది అవార్డుల ప్రధానోత్సవంలో అనేక విమర్శలు ఎదుర్కుంటున్నది. తెలుగు ఇండస్ట్రీ లో ఈ నంది రాజేసిన మంటలు అన్ని ఇన్ని కావు. కేవలం ఒక్క వర్గానికే కొమ్ము కాసారని ఇంకో వర్గాని పక్కన పెట్టారు అని కొందరు ఇలా అనేక విమర్శలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఈ నంది ప్రధానోత్సవంలో మెగా ఫ్యామిలీ కి తీవ్ర అన్యాయం జరిగిందని ఆ వర్గానికి చెందిన బని వాసు, బండ్ల గణేష్ అవార్డుల తీరు  పై  తమ నిరసన గాళ్ళని అసంతృప్తి ని తెలియజేశారు.గణేష్ అయితే ఇవి  నంది అవార్డులు కావని సైకిల్  అవార్డులు అన్ని ఘాటుగా విమర్శించాడు.ఐతే మెగా ఫ్యామిలీకి అన్యాయం చేశారంటూ వీళ్లు చేస్తున్న వాదన మీద నంది అవార్డు కమిటీలోని సభ్యులు ఎదురు దాడి చేశారు.
మెగా ఫ్యామిలీకి అన్యాయం చేసిందంటున్న కమిటీలో అల్లు అరవింద్ కూడా ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఆయనకు కూడా అవార్డుల ఎంపికలో భాగస్వామ్యం ఉందని.. కాబట్టి మెగా ఫ్యామిలీకి ఆయనే అన్యాయం చేసినట్లు భావిస్తారా అని వారు ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవికి రఘుపతి వెంకటయ్య అవార్డు ఆయనే ఇప్పించుకున్నట్లు.. పక్షపాతం ప్రదర్శించినట్లు భావిస్తారా అని వారు ప్రశ్నించారు.
ఐతే ఈ విషయమై బండ్ల గణేష్ ఎదురు దాడి చేశాడు. అల్లు అరవింద్ ఇలాంటి విషయాల్లో ఏమీ మాట్లాడరని.. తమ వాళ్లకే అవార్డులు ఇవ్వాలని పట్టుబట్టరని.. తాను కమిటీలో ఉన్నాను కాబట్టి తమ వాళ్లకు అవార్డులు ఇవ్వాలని అడగడం భావ్యం కాదు కాబట్టి సైలెంటుగా ఉంటారని.. అది ఆయన సంస్కారం అని బండ్ల అన్నాడు. దీనిపై వాదోపవాదాలు కొంచెం గట్టిగానే సాగాయి. అయితే బన్నీ వాసు చేసిన మాటలు మొన్నటి నుంచీ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు నందీ అవార్డ్ సరిగ్గా లేవు అని అన్న తరవాతనే రుద్రమదేవి టీం – గుణశేఖర్ కూడా బయటకి వచ్చారు. సో అల్లూ అరవింద్ నేరుగా రాకుండా వీరితో ఇలా మాట్లాడిస్తున్నడా అనే అనుమానాలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here