రంగుల రాట్నం సినిమా కి నాగార్జున బాగానే ఖర్చు పెట్టారు

యువ కథానాయకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రాజ్ తరుణ్, ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్లో ‘రంగుల రాట్నం’ సినిమా చేస్తున్నాడు. ఒక సాంగ్ మినహా ఈ సినిమాకి సంబంధించిన మిగతా షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ తరువాత అన్నపూర్ణ బ్యానర్లో రాజ్ తరుణ్ చేస్తోన్న సినిమా ఇది.
 కొత్త దర్శకురాలితో .. కొత్త హీరోయిన్ తో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మాదిరిగా ఈ సినిమా సందడిగా .. కలర్ ఫుల్ గా వుండాలని నాగ్ చెప్పారట. కథా పరంగా మూడు .. నాలుగు మ్యారేజ్ ఎపిసోడ్స్ ఉండటంతో, ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చూశారట. ప్రతి సీన్ గ్రాండ్ లుక్ తో ఉండేలా చూడటంతో, ఫస్టు కాపీకే నాలుగు కోట్ల వరకూ ఖర్చు అయిందని అంటున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నంలో నాగార్జున వున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here