టీడీపీ వాళ్ళకే నంది అవార్డులు – హీరో శివాజీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులపై పలు విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై సినీ హీరో శివాజీ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు కూడా గ‌తంలో ఇలాగే తీవ్రంగా అన్యాయం జ‌రిగింద‌ని చెప్పారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని అన్నారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు.
అవార్డులు ఇవ్వాలంటే ఒక కమిటీ వేసి, ప్ర‌జ‌ల అభిప్రాయం సేక‌రించి అప్పుడు అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో తాను న‌టించిన‌ మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంద‌ని అన్నారు. అప్ప‌ట్లో త‌న‌కు నంది అవార్డు ఇచ్చే విష‌యంలో అన్యాయం జ‌రిగిందని చెప్పారు. మిస్స‌మ్మ సినిమాకు త‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ఇవ్వాల‌ని 90 శాతం మంది క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేస్తే కొంద‌రు అడ్డుకున్నారని, త‌న‌కు ఈ విష‌యంపై ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here