చిలుకూరులో.. పెళ్లి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్

కన్ ఫ్యూజ్ అవకండి. మీ అనుమానం నిజమే. రియల్ లైఫ్ లోఎప్పుడో పెళ్లి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు రీల్ లైఫ్ కోసం.. చిలుకూరులో పెళ్లి చేసుకున్నాడు. జై లవ కుశ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న జూనియర్.. సినిమాలో హీరోయిన్ రాశీ ఖన్నాను పెళ్లి చేసుకునే సీన్ కోసం చిలుకూరు వెళ్లాడట.

అక్కడ ఎలాంటి హంగామా లేకుండా.. సినిమాకు కీలకమైన పెళ్లి సీన్లను షూట్ చేశారట. అది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట.

ఈ మూవీలో.. రాశీ ఖన్నాతోపాటు.. నివేథా థామస్, నందిత కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి సినిమాను థియేటర్లలో వదలాలని.. యూనిట్ ప్లాన్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here