గద్దర్ పాటకు.. పవన్ స్టెప్పులేస్తాడా?!

జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూసుకుపోతున్నాడు. ముందస్తు ఎన్నికలకు కూడా సై అంటున్నాడు. ఇటు తెలంగాణలో.. ప్రజాగాయకుడు గద్దర్ కూడా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. 70 ఏళ్లుగా ప్రజల కోసం చేసిన త్యాగాలే.. తను రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హతగా ఆయన చెబుతున్నారు.

ఈ విషయంపై.. మరింతగా తన అభిప్రాయాలను పంచుకున్న గద్దర్.. ఈ మధ్య జనసేన పార్టీ పేరు బాగా వినిపిస్తోందని అన్నారు. పవన్ కల్యాణ్.. తనకు చాలా కాలంగా మంచి మిత్రుడు అని చెప్పారు. తను పార్టీ పెడితే.. పవన్ తో కలిసి పని చేయడంపై ఆలోచిస్తానన్నారు.

మామూలుగా.. రాజకీయ కమ్యూనిస్టులకు పవన్ చాలా దగ్గరగా మెలుగుతున్నాడు. ఇప్పుడు మాజీ కమ్యూనిస్టు అయిన గద్దర్.. రాజకీయ పార్టీ పెడతా.. పవన్ తో కలుస్తా అని సిగ్నల్స్ ఇస్తున్నారు.

దీంతో.. గద్దర్ రాజకీయ పాటకు.. పవన్ పొలిటికల్ స్టెప్పులు వేస్తాడా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇద్దరూ కలిస్తే.. 2 తెలుగు రాష్ట్రాల్లో.. ఖచ్చితమైన మార్పు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here