రవితేజ – శ్రీను వైట్ల అప్పుడే టైటిల్ కూడా పెట్టేసారు

‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ .. వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. గతంలో మాదిరిగా తనదైన స్పీడ్ చూపించడానికే ఆయన రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తోన్న ఆయన, శ్రీను వైట్లతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
 గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నీ కోసం’ .. ‘ దుబాయ్ శీను’ .. ‘వెంకీ’ సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి మొదలైంది. కథ ప్రకారం ఈ సినిమాకి ‘అమర్ అక్బర్ ఆంథోని’ అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇక కథానాయికగా కాజల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. గతంలో ‘వీర’ .. ‘సారొచ్చారు’ సినిమాల్లో రవితేజ జోడీగా కాజల్ కనువిందు చేసింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here