భర్త మరణం తరవాత ఒక సినిమా ఒప్పుకున్న జయసుధ

తెలుగు తెరపై కథానాయికగా ఒక వెలుగు వెలిగిన జయసుధ .. సహజ నటిగా తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె భర్త నితిన్ కపూర్ మరణించారు. ఆయన మరణం మానసికంగా కుంగదీయడంతో, ఆమె ఇన్ని రోజులూ సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి జయసుధ .. తాజాగా మణిరత్నం సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.
 తమిళంలో ‘శింబు’ కథానాయకుడిగా మణిరత్నం ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్రను జయసుధతో చేయిస్తేనే బాగుటుందని భావించిన మణిరత్నం, స్వయంగా వచ్చి ఆమెతో ఆ పాత్ర గురించి మాట్లాడారట. దాంతో జయసుధ ఆ పాత్రను చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ సినిమాలో షాలినికి తల్లి పాత్రలో జయసుధ నటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here