మహేష్ కి బ్రహ్మోత్సవం ఇచ్చాడు .. అయినా కెరీర్ ముగియలేదు – సూపర్ స్క్రిప్ట్ సిద్దం చేసాడు

వెంకటేశ్ .. మహేశ్ బాబులతో మల్టీ స్టారర్ గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ సినిమాతో హిట్ కొట్టేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నే దృష్టిలో పెట్టుకుని ఆయన మహేశ్ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, భారీ పరాజయాన్నే మూటగట్టుకుంది.

 ఆ తరువాత ఆయన మరో కథపై కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ కథ పూర్తయిన తరువాత ఆయన అల్లు అరవింద్ ను కలవగా, గీతా ఆర్ట్స్ పై తెరకెక్కించడానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ కొత్తగా .. కథనం ఆసక్తికరంగా ఉండటం వల్లనే అల్లు అరవింద్ ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమా నూతన నటీనటులతో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి .. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here