10 రోజుల తరవాత కూడా దూసుకుపోతున్న గరుడ వేగ

విడుదలకి కొన్ని రోజుల ముందే అంచనాలను పెంచుకున్న ‘గరుడ వేగ’ .. విడుదల తరువాత హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతకు ముందు .. ఆ తరువాత విడుదలైన ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడింది. చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన సినిమా అయినప్పటికీ, దర్శకుడిగా ప్రవీణ్ సత్తారుకి పెద్దగా క్రేజ్ లేనప్పటికీ ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
 కథ .. కథనాలు .. టేకింగ్ .. ఈ సినిమాను నిలబెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే 15 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, 10 రోజుల్లో 22 కోట్ల వసూళ్లను రాబట్టింది. వసూళ్ల పరంగా ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా అదే వేగాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారుకి వరుస అవకాశాలు వస్తున్నాయట. ఇక కొత్త ఉత్సాహంతో వున్న రాజశేఖర్, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here