చార్మినార్‌ ముందు కుంతియా, జానారెడ్డిలను నిలువు కాళ్లపై నిలబెట్టించిన ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ రథ సారధి…. ఎప్పుడు లేటే…ఆయన ఎప్పుడూ గంటపాటు లేటు వస్తారని టాక్‌. దానికి తగ్గట్టే స్వయంగా ఆయనే పిలుపిచ్చిన కార్యక్రమానికి గంట లేటొచ్చారు. దీంతో కుంతియా, జానారెడ్డి వంటి సీనియర్‌ నేతలు చార్మినార్‌ ముందు గంటకు పైగా నిలువు కాళ్లపై నిడబడాల్సి వచ్చింది.
 తెలంగాణ కాంగ్రేస్ లో పిసిసి అధ్యక్షుడు ఉత్తం తీరు పై పార్టీనేతలు గుర్రుగా ఉన్నారు. ఎప్పుడు కార్యక్రమానికి వచ్చనా.. సమయపాలన పాటించరనే విమర్శ ఉత్తంపై ఉంది. అదే ఆనవాయితీని శనివారం నిర్వహించిన ముస్లిం రిజర్వేషన్ల పాదయాత్రలోనూ ఉత్తమ్‌ ఠంచన్‌గా పాటించారు. చార్మినార్ వద్ద 11 గంటలకు పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. టైమ్‌కి తెలంగాణా ఇంచార్జ్ కుంతియా, మాజి పిసిసి అద్యక్షుడు పొన్నాల, నగర శాఖ అద్యక్షుడు దానం నాగేందర్‌లు చేరుకున్నారు.
 కాంగ్రెస్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు చాలమంది పాతబస్తి కి చెందిన మహిళలు, యువకులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉత్తం సతీమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సైతం చార్మినార్ చేరుకున్నారు. కానీ పాదయాత్ర ప్రారంభం కాలేదు. పిసిసి అధ్యక్షడు ఉత్తం కుమార్ రెడ్డి కోసం అందరూ ఎదురు చూశారు. 12.30 గంటలైంది. ఉత్తమ్‌ లేకుండా పాదయాత్ర మొదలెడితే పరువు పోతుందని నేతలంతా గుంభనంగా ఉన్నారు. తీరా ఉత్తం చార్మినార్ చేరుకునే సరికి మధ్యాహ్నం 12.30 సమయం అయింది. ప్రజా కార్యక్రమంలో కూడా లేటైతే ఎలా అని సీనియర్లు ఉత్తమ్‌ను తప్పుబట్టారట.
ఇక ఉత్తమ్‌ నాయకత్వంలో పాదయాత్ర కూడా మొదట గందరగోళమైంది. ట్రాఫిక్‌ ప్రాబ్లమ్‌తో ఉత్తమ్‌ చేసేది లేక ఓపెన్‌ టాప్‌ జీప్‌ దిగి అందరితో కలిసి నడవడంతో ఉస్మానియా హాస్పిటల్‌ దాటే వరకు ఇబ్బంది తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here