అబ్బే ఎన్టీఆర్ సినిమా కాదు ఇది .. నితిన్ ది

నిర్మాతగా దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన చేసిన ‘శతమానం భవతి’ భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. ఈ సినిమాకి ‘శ్రీనివాస కల్యాణం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు కూడా.
ముందుగా ఈ కథను నాగార్జునతో చేయాలని భావించారుగానీ కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ కి కథ చెప్పారు .. ఆయనకి కథ నచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ, హీరోగా ఇప్పుడు నితిన్ పేరు వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ కథను నితిన్ కి వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే పనుల్లో వున్నారు. ‘దిల్’ రాజు ఇంటి పేరుగా మారిపోయిన ‘దిల్’ సినిమా, గతంలో ఆయన నితిన్ తో చేసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here