ఈ స్ప్రే అర నిమిషంలో క‌రోనా వైర‌స్‌ను చంపేస్తుంది..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ రెండోసారి విజృంభిస్తోంది. ఇక శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డంలో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కేవ‌లం అర నిమిషంలో క‌రోనా వైర‌స్‌ను చంపేసే స్ప్రేను త‌యారుచేశారంట శాస్త్ర‌వేత్త‌లు.

ప్లాజ్మా జెట్ 30 సెకెన్లలో కరోనా వైరస్‌ను చంపుతుందని ఒక పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు 3 డి ప్రింటర్ నుంచి రూపొందే ప్రెజర్ ప్లాస్మా జెట్ స్ప్రేను తయారుచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైన‌ట్లు తెలుస్తోంది. దీంతో క‌రోనా వైర‌స్‌ను నాశ‌నం చేసే స్ప్రేను క‌నుగొన్న‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు. కరోనా వైరస్‌ను చంపడానికి పరిశోధకులు 3డి ప్రింటర్ ప్రెజర్ ప్లాస్మా జెట్ స్ప్రేను సృష్టించారు. ఈ స్ప్రేను ప్లాస్టిక్, మెటల్, కార్డ్ బోర్డ్, తోలు (బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బేస్ బాల్) తదితర ఉపరితలాలపై ఉపయోగించినప్పుడు, దాని ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ మూడు సెకెన్లలో అంతమైనట్లు కనుగొన్నారు.

అలాగే మాస్క్‌పై ఈ స్ప్రేను ఉపయోగించినప్పుడు కూడా చక్కని ఫలితాలను వచ్చినట్లు తేలింది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లోగల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోఈ ప‌రిశోద‌న‌లు చేశారు. ఈ వివ‌రాను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పత్రికలో వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన మ‌రింత స‌మాచారం బ‌య‌ట‌కు రావాల‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో దీన్ని స్ప్రే చేసి క‌రోనా వైర‌స్‌ను చంపేయొచ్చ‌ని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here