చ‌నిపోయిన బ‌హ్రెయిన్ ప్ర‌ధానమంత్రి..

బ‌హ్రెయిన్ రాజు, ప్ర‌ధాన‌మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) బుధవారం కన్నుమూశారు. ఈయ‌న ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలు అందించారు. కాగా గ‌త కొంత కాలంగా అనారోగ్య కార‌ణాల‌తో చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఈ వివ‌రాల‌ను రాయ‌ల్ ప్యాలేస్ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీఫా అమెరికాలోని మయో క్లినిక్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రధాని మృతికి సంతాపంగా బహ్రెయిన్ దేశవ్యాప్తంగా వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించడంతో పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర శాఖలకు గురువారం నుంచి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.

కాగా ఖలీపా బహ్రెయిన్ ప్రధానిగా సుమారు ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. 1935లో జన్మించిన ఖలీఫా.. బహ్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన 1971, ఆగస్టు 15కు ఒక ఏడాది ముందు నుంచే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 50 ఏళ్లు ప్రధానిగా పనిచేసి, ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయ‌న లేని లోటు దేశ ప్ర‌జ‌లు ఊహించుకోలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here