వెంక‌టేష్‌, రానా ఇద్ద‌రూ క‌లిసి చేస్తున్న షో ఇదే..!

ద‌గ్గుబాటి బాబాయ్‌, అబ్బాయ్ ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్‌మీద ఉన్నారు. వెంక‌టేష్ ఆల్ రౌండ్ ఆడియ‌న్స్‌ని అల‌రిస్తుంటే.. రానా త‌న‌కంటూ సొంత ఇమేజ్‌ను తెచ్చుకొని రాణిస్తున్నారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు హీరోల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాల‌పై ఫోక‌స్ న‌డుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఈ బాబాయ్ అబ్బాయి ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల‌న్నది అంద‌రి కోరిక‌. అయితే వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌బోతున్న‌ట్లు కూడా ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. కానీ అంత‌క‌న్నా ముందే వీరిద్ద‌రినీ మ‌నం ఒకే వేదిక‌పై చూడ‌బోతున్నాం. సినిమా కంటే ముందుగానే వెంకటేశ్‌, రానా కలిసి ప్రేక్షకాభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారట. రీసెంట్‌గా రానా స్టార్ట్‌ చేసిన యూ ట్యూబ్‌ ఛానెల్‌ కోసం వెంకీ, రానా కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు.

అంతే కాకుండా వీరి కాంబినేషన్‌లో ఓ రియాలిటీ షో చేయడానికి ప్రముఖ టీవీ ఛానెల్‌ ప్లాన్‌ చేసిందట. ఇప్ప‌టికే రానా హోస్ట్‌ చేసిన నెంబర్‌ వన్‌ యారీ అనే టీవీ షోలోనూ వెంకీ గెస్ట్‌గా వచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్న రియాలిటీ షో వీటికి భిన్నంగా ఉంటుందట. కాగా ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన పూర్తి స‌మాచారం అధికారికంగా రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here