స‌రిహ‌ద్దులో పాకిస్తాన్ ఏం చేస్తుందో చెప్పిన బీఎస్ఎఫ్ అధికారి..

భార‌త్ అంటేనే పాకిస్తాన్ ర‌గిలిపోతుంద‌ని మ‌నం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా పాకిస్తాన్ భార‌త్‌పై అంతే స్థాయిలో వ్య‌తిరేక‌త‌తో ప్ర‌వ‌ర్తిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నో సార్లు పాకిస్థాన్ భార‌త్‌పై దాడులు చేస్తూనే వ‌స్తోంది. తాజాగా కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన విష‌యం తెలిసిందే.

కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని కాద‌ని పాకిస్తాన్ దాడులు చేయ‌డం వ‌ల్ల ఎంతో మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో జ‌వాన్ల‌తో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ వైఖ‌రిపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కశ్మీరు బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేశ్ మిశ్రా మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ మన దేశంలోని సామాన్యుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. పాకిస్థాన్‌ దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలని పేర్కొంది.

భారతీయుల ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్న పాకిస్థాన్‌ గురించి ప్రపంచానికి వివరించాలని తెలిపింది. పాకిస్థాన్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో సామాన్య ప్రజలకు తీవ్ర హాని జరుగుతోందన్నారు. సామాన్యులు ప్రాణాలను, ఆస్తులను కోల్పోతున్నారన్నారు. ఈ నెల 13న నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పాకిస్థాన్ సైన్యం బరితెగించి కాల్పులు జరిపిన నేపథ్యంలో రాజేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్‌కు స‌రైన స‌మయంలో భార‌త్ బుద్దిచెబుతూనే ఉంది. ఐజి స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడ‌టం చూస్తే ఏ స్థాయిలో అక్క‌డ పాకిస్తాన్ చ‌ర్య‌లు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని మేధావులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here