సింగ‌ర్ సునీత ఇప్పుడు స‌డెన్‌గా పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణం ఇదే..

సింగ‌ర్ సునీత గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఇండ‌స్ట్రీలో ఆమె పాడిన పాట‌ల‌కు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఆమె వ్యక్తిగ‌త జీవితంపై ప‌లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. దీనికి తాజాగా ఆమె గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

సునీత నేడు నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వ‌ర‌లోనే ఆమె పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విష‌యాన్ని సునీతే స్వ‌యంగా వెల్ల‌డించారు. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు కూడా. కొన్ని రోజుల ముందు నుండి సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమేనని రుజువు చేస్తూ సింగర్‌ సునీత సోషల్‌ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు.

ఇక సునీత తాను ఎందుకు పెళ్లిచేసుకోబోతున్నారో కూడా క్లియ‌ర్‌గా చెప్పారు. సునీత ఏమ‌న్నారంటే.. ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్‌ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిల్లలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. . మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని సునీత మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here