తెలుగువారు నో అన్నారు .. తమిళం లో సూపర్ హీరో

హీరో అవ్వదానికంటే ముందర్ మంచి నటుడు గా పేరు సంపాదించిన హీరో సందీప్ కిషన్ .. స్నేహగీతం ప్రస్తానం లాంటి సినిమాల్లో సందీప్ యాక్షన్ కి సూపర్ మార్కులే పడ్డాయి. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఫుల్ టర్న్ హీరోగా మారిన సందీప్ ఈ సినిమా తరవాత కూడా మంచి అవకాశాలు చేసాడు. కానీ అన్నీ ప్లాపులు గా మిగిలాయి. బీరువా , టైగర్ లాంటి సినిమాలు పరవాలేదు అన్నట్టుగా రన్ అయ్యాయి .. కానీ కెరీర్ మీద మాత్రం ఎక్కడా పెద్ద ఆసక్తి రేగలేదు.

తెలుగు లో నగరం గా వచ్చిన సినిమా తమిళం లో మానగరం గా వచ్చింది. సందీప్ కి ఆ చిత్రం అక్కడ తెగ పాపులారిటీ తెచ్చిపెట్టింది. అక్కడి సినిమా ప్రముఖులు ఈ సినిమానీ , హీరో నీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మాయవన్ అనే కొత్త సినిమాలో చేసాడు సందీప్ ఆ సినిమాకి పిచ్చ ఫేం వచ్చేసింది అప్పుడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here