కాటమరాయుడు కి అంత సీన్ లేదు .. ఇక మహేష్ వంతు

గత తొమ్మిది సంవత్సరాల నుంచీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న చిరంజీవి తన ఖైదీ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కి తన సత్తా ఏంటో చూపించాడు. ఖైదీ 150 చిత్రం తో తెలుగు లో నాన్ బాహుబలి రికార్డు సెట్ చేసిన చిరంజీవి తన స్టామినా గురించి తక్కువ అంచనా వేసినవారికి మొదటి సినిమా తోనే చుక్కలు చూపించాడు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు ని మొదట మొదలు పెట్టిందే శ్రీమంతుడు సినిమా టైం నుంచీ దాన్నీ జనతా గ్యారేజ్ నీ పక్కకి నెట్టేసిన చిరంజీవి నెంబర్ 1 గా ఉన్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ తన కాటంరాయుడు తో ఈ రికార్డు బ్రేక్ చేస్తాడు అనుకున్నారు అందరూ కానీ అలా జరగలేదు. మొదటి రోజు నుంచే వచ్చిన కాస్తంత నెగెటివ్ టాక్ తో సినిమా గ్రాఫ్ కొద్దిగా సన్నగిల్లింది. సో ఇప్పుడు ఆ టార్గెట్ మహేష్ కి సెట్ అయ్యింది. మహేష్ కొత్త సినిమా మురుగదాస్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మహేష్ కేరీర్ లోనే అతిపెద్ద చిత్రంగా రాబోతోంది. ఇది ఖచ్చితంగా ఖైదీ రికార్డులు బ్రేక్ చేస్తుంది అని మహేష్ ఫాన్స్ ధైర్యంగా ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here