భర‌త్ ప్రాణం తీసిన కామెడీ డైర‌క్ట‌ర్..?

 భ‌ర‌త్ కంటే హీరో ర‌వితేజ త‌మ్ముడు అంటే ట‌క్కున గుర్తొస్తాడు. మాద‌క ద్ర‌వ్యాలు, స్మ‌గ్లింగ్ గ‌ట్ర లాంటి వాటిల్లో కొన్నిసార్లు  పోలీసుల‌కు రెడ్ హ్యండెడ్ గా చిక్కాడు. అయితే అమెరికాలో ఉద్యోగం చేస్తూ  ల‌గ్జ‌రీ లైఫ్ ను అనుభ‌వించే స్థాయి నుంచి మాద‌క ద్ర‌వ్యాలకు బానిస‌య్యే స్థితి దిగ‌జార‌డం భ‌ర‌త్ జీవితం ఓ ట్రాజెడీ సినిమాను త‌ల‌పిస్తుంది. ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్న భ‌ర‌త్ అర్ధాంత‌రంగా త‌నువు చాలించ‌డం వెనుక ఓ కామెడీ డైర‌క్ట‌ర్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అమెరికాలో జ‌రిగిన తానా స‌భ‌ల‌కు హాజ‌రైన ఆ కామెడీ డైర‌క్ట‌ర్..భ‌ర‌త్ ను ఉద్దేశించి అయ్యా భ‌రత్ నిన్ను హీరో ని చేస్తా..నువ్వు హీరోలా ఉన్నావ్ ..మీ అన్న ర‌వితేజ‌ను మించి పోతావ్ అన్నాడు.  అంతే డాల‌ర్ డ్రీమ్ జాబ్ ను వ‌దిలేసి..వెండితెర‌పై వెలిగిపోవాల‌ని క‌ల‌లు క‌న్నాడు. జీవితం అంతాసాఫీగా సాగుతుంది. ల‌వ్ మ్యారేజ్ చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాడు. కానీ అత‌నికేం తెలుస్తోంది. ఆ డైర‌క్ట‌ర్ అన్న మాట‌లు త‌న జీవితాన్ని నాశ‌నం చేస్తాయ‌ని.
డైర‌క్ట‌ర్ అన్న మాట‌ల‌కు ముందుకు వెన‌కా ఆలోచించ‌కుండా హైద‌రాబాద్ కు ప‌య‌న‌మ‌య్యాడు. నువ్వు హీరో అన్న డైర‌క్ట‌ర్ ప‌త్తాలేకుండా పోయాడు. వెండ‌తెర పై వెలిగిపోవాల‌న్న ఆశ‌చావ‌దుగా అందుకే దొరికిన క్యార‌క్ట‌ర్లు చేసుకుంటు జీవ‌నం సాగిస్తున్నాడు. కానీ మ‌న‌సు ప్ర‌శాంతంగా  ఉండ‌నిస్తేగా సంపాద‌న స‌రిపోదు. అన్నమీద ఆధార‌ప‌డ‌టం క‌రెక్ట్  కాద‌నిపించిందేమో మాద‌క ద్ర‌వ్యాలు, మందుకు బాగా బానిస అవ్వ‌డం, ఆ  అడ్డ‌దారులు తొక్క‌డం. ఇవ‌న్నీ క‌ట్టుకున్న భార్య‌కు న‌చ్చ‌క వ‌దిలేసి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది.
 స‌ల్మాన్ బిగ్ బాస్ లో గెస్ట్ గా అవ‌కాశం  వ‌చ్చి స‌న్న‌ద్దం అవుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో భ‌ర‌త్ క‌న్నుమూశాడు. భ‌ర‌త్ ఇన్ని అడ్డ‌దార్లు తొక్క‌డానికి కార‌ణం ఆద‌ర్శ‌కుడు. ఆ మహానుభావుడు సినిమా ఆశలు రేకెత్తించకుండా ఉంటే అతడి జీవితం  అమెరికాలో సాఫీగా సాగిపోయేది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here