అత‌డితోనే నా డేటింట్ , నాఫేవ‌రేట్

నాన్న‌కు ప్రేమ‌తో ఫేమ్ ర‌కుల్ పీత్ సింగ్ తాను డేటింగ్ చేయాల‌న్నా, పెళ్లి చేసుకోవాల‌న్నా, ప్రేమించాల‌న్నా అత‌నే అంటూ త‌న ఇష్టా ఇష్టాల్నిఓ ఇంటర్వ్యూలో భ‌య‌ట‌పెట్టింది. ఇన్నిరోజులు ఈ అమ్మ‌డి ఇష్టాఇష్టాలు గురించి అంత‌గా తెలియ‌వు. ఒక్క‌సారి ర‌కుల్ చెప్పిన ఇంట‌ర్వ్యూతో సినీ జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ మ‌హేష్ స్పైడ‌ర్ తో, త‌దుప‌రిచిత్రం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది. అయితే ముద్దుగుమ్మ చెప్పిన ఇంట‌ర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.
సౌత్ ఇండ‌స్ట్రీ ఫేవ‌రేట్ హీరోలు ఎవ‌ర‌ని అడ‌గ్గా ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ , సూర్య‌, ధ‌నుష్ లు చెప్పేసింది. లెజెండ‌రీల‌లో చిరంజీవి, అమితాబ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేనంటూ.. మ‌రి అల్లు అర్జున్ ఫేవ‌రేట్ యాక్ట‌ర్ , ఫేవ‌రేట్ కోస్టార్ చ‌ర‌ణ్ అని అన్న‌ది. అల్లు అర్జున్, సూర్య, ధ‌నుష్ ల‌తో డేటింగ్, ల‌వ్, మ్యారేజ్ ఎవ‌రిని చేసుకుంటారు అని అడ‌గ్గా వారితో అలా ఊహించుకోలేను.. బాలీవుడ్ ర‌ణ్వీర్ సింగ్ అంటే త‌న‌కిష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది ఈ అమ్మ‌డు. మ్యారేజ్, డేటింగ్, ల‌వ్ అంటే అతనితోనే అంటూ సిగ్గు మొగ్గ‌లు తొడిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here