వెయిటింగ్ లిస్ట్ బాధలుండవు.. రైల్వే లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది!

ట్రైయిన్ టికెట్ బుక్ చేసుకుందామంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంద‌ని తెగ హైరానా ప‌డిపోతుంటారు. వెయిటింగ్ లిస్ట్ అంటే ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందే. అందుకే ప్ర‌యాణికులు వెయిటింగ్ లిస్ట్ అంటే హ‌డలిపోతారు. అటువంటి వెయిటింగ్ లిస్ట్ నుంచి ప్ర‌యాణికుల కోసం సెంట్ర‌ల్ రైల్వే స‌రికొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది.  ఐఆర్‌సీటీసీ సంస్థ ఐఆర్‌సీటీసీ వికల్ప్‌ పేరిట ఓ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
 ఇది వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం.. వికల్ప్” ఎలా పనిచేస్తుందంటే.. మీరు చెన్నై నుంచి  హైద‌రాబాద్  వెళ్లడానికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ట్రైనింగ్‌ టికెట్‌ బుక్ చేసుకున్నారనుకుందాం. ట్రెయిన్ సాయంత్రం 10 గంటలకి. మ‌ధ్యాహ్నం పీఎంకి ఛార్ట్ ప్రిపేర్ అయింది, మీకు టికెట్ రాలేదు. దిగులు పడాల్సిన పనిలేదు. సాయంత్రం 6త‌రువాత చెన్నైనుంచి హైద‌రాబాద్ కు  వ‌చ్చే ఇతర ట్రెయిన్స్‌లో  మీకు కచ్చితంగా బెర్త్ కేటాయిస్తారు.
స్లీప‌ర్ బుక్ చేసుకున్నా 3 ఏసీ, 2 ఏసీ, 1 ఏసీ లో కూడా మీకు బెర్త్ దొర‌కుతుంది. అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వు. విక‌ల్ప్ లో టికెట్  క‌న్ఫామ్ చేసుకోవాలంటే మెసేజ్ వ‌స్తుంది. అదీ కేవ‌లం ఐఆర్ సీటీసీకి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.  దానిలో మీరు కన్ఫామ్‌ చేయొచ్చు లేదా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోదలుచుకుంటే క్యాన్సిల్‌ చేసుకోనూవచ్చు. మీకు క్యాన్సల్‌ ఛార్జెస్‌ పోనూ మిగిలిన మొత్తం రిఫండ్ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here