పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు థియేటర్ యాజమాన్యాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. GHMC, నగర పాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయితీల్లో టికెట్ ధర గరిష్టంగా 20, కనిష్టంగా 10 పెంచేందుకు హోం శాఖ అనుతించింది. మల్టీప్లెక్స్ లలో కనీసం 20% సీట్లు లోయర్ క్లాస్ కు ఉండేలా చూడాలని ఆదేశించింది.
 రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. GHMC, నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలవారీగా ప్రభుత్వం టికెట్ ధరలు నిర్ణయించింది. ఉత్తర్వులకు లోబడి టికెట్లు అమ్మాలని ఆదేశించింది.
 GHMC పరిధిలోని ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ టికెట్ ధర 120, లోయర్ క్లాస్ టికెట్ ధర 40 రూపాయలుగా నిర్ణయించారు. నాన్ ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ 60, లోయర్ క్లాస్ టికెట్ 20 రూపాయలు చేశారు. మున్సిపాలిటీల్లోని ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ 80, లోయర్ క్లాస్ టికెట్ 30.. నాన్ ఏసీ థియేటర్లలోని బాల్కనీ 60, లోయర్ క్లాస్ ధర 20 గా నిర్ణయించారు. నగర పంచాయితీ, గ్రామ పంచాయితీ ఏసీ థియేటర్లలో బాల్కనీ ధర 70, లోయర్ క్లాస్ ధర 20 కానుంది. నాన్ ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ 50, లోయర్ క్లాస్ 15 రూపాయలు చేశారు.
 సినిమా హాల్స్ ఆధునీకరణకు 2 నుంచి 7, నాన్ ఏసీ థియేటర్లలో 2 నుంచి 5 రూపాయలు పెంచుకొనే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్సుల్లో గోల్డ్, రాయల్ టికెట్ల ధరలు 300 మించకూడదని తెలిపింది. ఎగ్జిక్యూటివ్ టికెట్ల ధరలు 200 మించరాదని సూచించింది. మల్టీప్లెక్సుల్లో రెండు వరుసల్లో కనీసం 20% సీట్లు లోయర్ క్లాస్ కు ఉంచాలని ఆదేశించింది.
 పెంచిన టికెట్ ధరలోనే థియేటర్ నిర్వహణ వ్యయం, ఆన్ లైన్ చార్జీలు, జీఎస్టీ చార్జీలు ఉండనున్నాయి. వీటిని తప్పనిసరిగా టికెట్లపై ముద్రించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here