క‌రోనా టీకా వ‌చ్చిన వెంట‌నే ఇచ్చేది వీరికే..

క‌రోనా వైర‌స్‌కు సంబంధించి టీకా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు వేగంగా తీసుకుంటోంది. ఇప్ప‌టికీ వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాల‌న్న జాగ్ర‌త్త‌లు చెబుతూనే.. మ‌రోవైపు వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పూర్త‌యిన వెంట‌నే ఏ విదంగా పంపిణీ చేయాల‌న్న దానిపై ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

ఇప్ప‌టికే భార‌త్‌లో ప‌లు ర‌కాల వ్యాక్సిన్లు ప్ర‌రీక్ష‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడారు. వ‌చ్చే సంవ‌త్స‌రం జులై నాటికి 500 మిలియ‌న్ డోసుల‌ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. ఇది 25 కోట్ల మందికి స‌ర‌ఫ‌రా చేయొచ్చ‌ని తెలిపారు. ఇండియాలో రెండు టీకా సంస్థ‌ల ప్ర‌యోగాలు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. వీటిలో భార‌త్ బ‌యోటెక్ టీకా ఒక‌టి, మ‌రొక‌టి జైడ‌స్‌ క్యాడిలా లిమిటెడ్‌కి చెందిన‌ది అని తెలిపారు.

ఇప్ప‌టికే ర‌ష్యా వ్యాక్సిన్ స్నుతిక్ వి ట్ర‌య‌ల్స్ ఇండియాలో చేప‌ట్టేందుకు డాక్ట‌ర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ పూర్త‌యిన వెంట‌నే ప‌ది కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను భార‌త్‌కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇలా ఇండియాలో త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ల డోసుల‌తో స‌హా, ఇత‌ర దేశాల డోసులు అన్నీ క‌లిపి ప్ర‌జ‌ల‌కు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అంత‌వ‌ర‌కూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. కాగా టీకా వ‌చ్చిన వెంట‌నే 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి టీకా ఇస్తార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here