వీళ్లంతా ఆఫీస్‌కు రావాల్సిన అవ‌స‌రం లేదని చెప్పేశారు..

క‌రోనా కార‌ణంగా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. అప్ప‌ట్లో లాక్‌డౌన్ ఉన్న‌ప్పుడు చాలా మంది ఇంటి ద‌గ్గ‌రి నుంచే ప‌నిచేశారు. అయితే ఇప్పుడు ప‌లు కంపెనీలు కార్యాల‌యాలు తెరిచాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం శీతలపానీయాల దిగ్గజ సంస్థ కోకాకోలాపై పడింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల కోకాకోలా అమ్మకాలు దెబ్బతిన్న నేపథ్యంలో పునర్ నిర్మాణంలో భాగంగా 2021 సంవత్సరంలో 2,200 మంది ఉద్యోగాలను తగ్గించాలని కోకాకోలా నిర్ణయించింది. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అమెరికా దేశంలో 1200 మంది కోకాకోలా ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి చెప్పారు. కోకాకోలా విక్రయాలు పడిపోయాయి.

దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు 2,200 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. కోకాకోలా మూడవ త్రైమాసిక లాభాల్లో 33 శాతం క్షీణించి 1.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. కోకాకోలాతోపాటు అమెరికా దేశంలోని పెద్ద కంపెనీలైన భీమా ఆల్స్టేట్, ఆయిల్ దిగ్గజ కంపెనీ ఎక్సాన్ మొబిల్, అమెరికన్ ఎయిర్ లైన్, యునైటెడ్ ఎయిర్ లైన్లలోనూ ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను తొల‌గించాయి. ఇలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో జీతాల‌పై కోత విధించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here