క‌రోనా విజృంభిస్తున్న టాప్ 5 స్టేట్స్ ఇవే..

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. అయితే ఇండియాలో రిక‌వ‌రీ రేటు కూడా ఎక్కువ‌గానే ఉంది. ప్ర‌పంచంతో పోల్చితే మ‌న దేశంలోనే ఎక్కువ మంది క‌రోనా నుంచి కోలుకుంటున్నారు. కాగా మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, ఏపీ, త‌మిళ‌నాడులో క‌రోనా విజృంభణ ఎక్కువ‌గా ఉంది.

దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైంది మ‌హారాష్ట్రలోనే. ఇక్క‌డ 15,28,226 కేసులు ఉన్నాయి. ఇక్కడ రిక‌వ‌రీ రేటు 82 శాతం ఉంది. కాగా రాష్ట్రంలో 25,079 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింది. వీరిలో 260 మంది చ‌నిపోయారు. ఇక కేర‌ళ‌లో కూడా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మొద‌ట్లో కేసుల తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉన్నా ఇప్పుడిప్పుడే కేర‌ళ‌లో కేసులు పెరుగుతున్నాయి. రిక‌వ‌రీ రేటు మాత్రం 65.4 శాతంగా ఉంది.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ దేశంలో మాత్రం రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య చాలా త‌గ్గిపోయింది. కేవ‌లం మూడువేల కేసులే నమోద‌వుతున్నాయి. గ‌తంలో ప‌ది వేల‌కు పైగా కేసులు ప్ర‌తి రోజూ న‌మోద‌య్యేవి. మొత్తం 7,58,951 మందికి క‌రోనా సోక‌గా..6256 మంది చ‌నిపోయారు. ఏపీలో రిక‌వ‌రీ రేటు 93 శాతం ఉంది.

ఇక క‌ర్నాట‌క‌లో కూడా క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 9500 కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో 9966 మంది ప్రాణాలు విడిచారు. ఇక త‌మిళ‌నాడులో కూడా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 91 శాతం గా ఉంది. ఈ రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here