ఏకంగా రిసార్టునే బుక్ చేసిన ‘పుష్ప’ టీం..!

అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం అక్రమ రవణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్టైలిష్‌ స్టార్‌ ఈ చిత్రంలో మాస్‌ లుక్‌లో నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటికే కొంత మేర షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్‌ మళ్లీ చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. నిజానికి కేరళలోని అడవుల్లో షూటింగ్‌ జరగాల్సిందిగా.. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న నేపథ్యంలో షూటింగ్‌ లోకేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు మార్చేశారు.

తాజాగా సినిమా షెడ్యుల్‌ను త్వరలోనే రాజమండ్రికి సమీపంలోని మారెడుమిల్లి ఫారెస్ట్‌ ప్రాంతంలో మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర సభ్యుల కోసం నిర్మాతలు ఏకంగా ఓ రిస్టార్‌నే బుక్‌ చేశారు. తొలి షెడ్యుల్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకు చిత్ర యూనిట్‌ అంతా రిసార్ట్‌ లోనే ఉండేలా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కరోనా ప్రభావం నేపథ్యంలో షెడ్యుల్‌ పూర్తయ్యే వరకు సెట్‌ నుంచి ఎవరిని బయటకు పంపించకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here