క‌రోనా మ‌ర‌ణాలు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న రాష్ట్రాలు ఇవే..

దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతూనే ఉంది. కొత్త‌గా కేసులు న‌మోద‌వుతున్నా రిక‌వ‌రీ రేటు కూడా ఎక్కువ‌గానే ఉంది. అయితే దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

ఎనిమిది రాష్ట్రాల నుంచి కోవిడ్ కొత్త మరణాలు ఎక్కువగా నమోదయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు కొత్తగా 444 మరణాలు చోటు చేసుకోగా, దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 1,37,173కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ మరణాల్లో 71 శాతం ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌‌లో చోటుచేసుకున్నాయి.

మహారాష్ట్రల్లో ఆదివారం 89 మరణాలు చోటు చేసుకోగా, 68 మరణాలు ఢిల్లీలోనూ, 54 పశ్చిమబెంగాల్‌లోనూ నమోదయ్యాయి. 8 రాష్ట్రాల్లో మెజారిటీ కోవిడ్ మరణాలు ఈ మూడు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. కాగా, దేశంలోని కేస్ ఫ్యాటలిటీ రేట్ (సీఎఫ్ఆర్) క్రమక్రమంగా తగ్గుతోంది. ఆగస్టులో సీఎఫ్ఆర్ 1.98 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.45 శాతంగా ఉంది. దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 94 లక్షలను దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ప్రకటించింది. గత 24 గంటల్లో 38,772 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,31,692కు చేరిందని, వీటిలో 4,46,952 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 88,47,600 మందికి స్వస్థత చేకూరినట్టు పేర్కొంది. కొత్తగా 443 మంది మృతి చెందడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,37,139కు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here