షూటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు వెళ్లిపోయిందో చెప్పిన శృతిహాస‌న్‌..

హీరోయిన్ శృతి హాసన్ గురించి ఇటీవ‌ల ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. లాక్‌డౌన్ త‌ర్వాత సినిమా షూటింగ్‌ల‌తో శృతి బిజీ అయిపోయింది. అయితే ఓ సినిమా షూటింగ్‌లో నుంచి ఆమె మ‌ద్య‌లోనే వెళ్లిపోయారు. దీంతో ఈ విష‌యంలో శృతి ఎందుక‌లా చేసింద‌న్న చ‌ర్చ ఇప్పుడు న‌డుస్తోంది. తాజాగా దీనిపై ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది.

కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు ఇంటికే పరిమితమైన శ్రుతి ప్రస్తుతం షూటింగ్‌లకు హాజరవుతోంది. కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్‌ల్లో పాల్గొంటోంది. తాజాగా సినిమా షూటింగ్‌కు హాజరైన శ్రుతి కోవిడ్ భయం కారణంగానే మధ్యలోనే ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోయిందట. కరోనా నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటోంది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో కరోనా నిబంధనలను పక్కగా పాటించేవాళ్లమ‌ని… కానీ రాను రాను నిర్లక్ష్యం పెరిగిపోతోందని చెబుతోంది. కోవిడ్ అంటే కేవలం జలుబు మాత్రమే కాదు. తీవ్రమైన అనారోగ్య సమస్య. మాస్క్ సరిగ్గా ధరించకపోతే ఇబ్బందులు తప్పవని శృతి సీరియ‌స్‌గా చెబుతోంది. ఇటీవ‌ల ప్ర‌జ‌లు మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావ‌డం చాలా సంద‌ర్బాల్లో చూస్తున్నాం. దీనిపై ప్రభుత్వాలు కూడా సీరియ‌స్‌గానే ఉన్నాయి. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత శృతి షూటింగ్ మ‌ధ్య‌లో వెళుతూ తీసుకున్న నిర్ణ‌యం క‌ర‌క్టే అంటున్నారు కొంద‌రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here