అమెరికాకు వెన‌క్కునెట్టి ముందుకెళ్లిన భార‌త్‌.. నివేదిక‌లు ఇవే..

ఇండియాలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజుకు 90 వేల కేసుల దాకా న‌మోద‌వుతూనే ఉన్నాయి. దీంతో ప్ర‌పంచంలోనే రెండవ స్థానానికి భార‌త్ చేరింది. అమెరికా కంటే భార‌త్ అన్నింటిలో ముందంజ వేస్తుంది.

క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో అమెరికా టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే భార‌త్ ఆ రికార్డు బ్రేక్ చేసేట‌ట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే అమెరికాలో ప్ర‌తి రోజూ 40 వేల దాకా కొత్త కేసులు న‌మోదవుతుంటే..  ఇండియాలో ప్ర‌తి రోజూ 90 వేల కేసులు దాకా న‌మోద‌వుతున్నాయి. అమెరికాలో ప్ర‌తి రోజూ 700 నుంచి 800 మ‌ర‌ణాల దాకా న‌మోద‌వుతుంటే.. మ‌న దేశంలో ఈ ఐదు రోజుల్లో ప్ర‌తి రోజూ వెయ్యి మందిదాకా మ‌ర‌ణిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం మ‌ర‌ణాల రేటు త‌గ్గింద‌ని చెబుతోంది. కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను చేయ‌డం ద్వారా వ్యాధి మొద‌టి ద‌శ‌లోనే గుర్తించి చికిత్స అందించ‌డం ద్వారా ఇది సాధ్య‌మైంద‌ని తెలిపింది. ఇక దేశంలో అత్య‌ధిక కేసులు ఉన్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర‌ప్రదేశ్‌లు ఉన్నాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,98,125 కాగా, తెలంగాణాలో 1,40,969గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here