ప్రతి అమ్మాయి అందుకోసమే ఆలోచించదు: తాప్సీ

బాలీవుడ్ యంగ్ హీరో ‘ధోని’ ఫేమ్…  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ అంశం మీడియా తో పాటు, సోషల్ మీడియాలోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సుశాంత్ ప్రియురాలు రియాను సీబీఐ ఇప్పటికే పలుసార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా పలు విమర్శలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సుశాంత్ మరణానికి రియానే కారణమని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ తరుణంలో రియాకు పలువురు మద్దతు కూడా  పలుకుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి తాప్సీ… రియా పై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ… ‘ వ్యక్తిగతంగా సుశాంత్, రియాలతో నాకు పెద్దగా పరిచయం లేదు. మానవత్వం ఉన్న ఒక మనిషిగా రియా కు మద్దతుగా మాట్లాడుతున్నాను. మగవాడి వెనుక ఉన్న ప్రతి అమ్మాయి డబ్బు కోసమే ఆలోచిస్తోందనుకోవడం సబబు కాదు. విచారణ పూర్తయ్యాక నిజా నిజాలన్నీ తెలుస్తాయి. ఈలోపు కంగారుపడి ఎదుటి వారిపై రాళ్లు వేయడం సరైన పద్ధతి కాదు’ అంటూ వ్యాఖ్యానించింది తాప్సీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here